పారామిలిటరీ జవాన్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
*రేయింబవళ్ళు దేశ సరిహద్దుల్లో మొదటి వరుసలో ఉండి దేశ రక్షణ గావిస్తున్న పారామిలిటరీ సైనికులకు, రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాల్లో చోటు కల్పించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, పారామిలిటరీ జవాన్లకు అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని; అదేవిధంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా 23.11.2012 లో ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రంలో అమలుచేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని గౌ. ముఖ్యమంత్రి గారికి విన్నవించిన పత్రాన్ని ; పలాస శాసనసభ్యులు అయిన శ్రీమతి. గౌతు శిరీష గారికి అందజేయటం జరిగింది.*
* శాసన సభ్యులు మాట్లాడుతూ... ఈ విషయం ఇంతవరకూ మా దృష్టికి రాలేదని, వినతిపత్రం లో పొందుపరచిన విషయాల్ని గౌ.ముఖ్యమంత్రి గారికి, గౌ. ఉప ముఖ్యమంత్రి గారికి మరియు గౌ. రాష్ట్ర హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తగు న్యాయం జరిపేందుకు తన వంతుగా కృషి చేస్తానని పారామిలిటరీ సైనికులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పారామిలిటరీ సంక్షేమ సంఘ సభ్యులైన శ్రీ రామారవు, ప్రెసిడెంట్, శ్రీ Y A నాయుడు, వైస్ ప్రెసిడెంట్ D. లక్ష్మణ రావు గారు, K. ఇంద్రతనయ గారు, J. వల్లభరావు గారు, రాజారావు గారు, రవి కుమార్ గారు, P. సోమేశ్వరరావు గారు, రాజ్ కుమార్ గారు పాల్గొన్నారు.