ఆలూరు సిఐ శ్రీనివాస నాయక్, ఎస్సై నరసింహులు ..
:-ఆలూరు.
ప్రస్తుత సమాజంలో డిజిటల్ ప్రపంచంలో అన్ని రకాల కార్యక్రమాలలో అధిక భాగం సెల్ ఫోన్లు ,లాప్టాప్ లలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఇంటర్నెట్ వేదికగా జరుగుతున్న సైబర్ నేరాలపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస నాయక్, ఆలూరు సబ్ ఇన్స్పెక్టర్ నరసింహులు శుక్రవారం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలూరు పట్టణంలోని మోడల్ హై స్కూల్, అదేవిధంగా జూనియర్ కళాశాల విద్యార్థులతో కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలూరు సర్కిల్ పోలీస్ అధికారులు, 8వ తరగతి నుండి మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ కార్యక్రమం పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని, అదేవిధంగా తమ ఇంట్లో పెద్దలతో పాటు తమ చుట్టుపక్కల బంధుమిత్రులకు సైబర్ నేరాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలియని నంబర్ల నుంచి మొబైల్ ఫోన్లకు వచ్చేటటువంటి లింకులను ఓపెన్ చేయరాదని, తమ వద్ద ఉన్నటువంటి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎం కార్డులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కొరకు అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పరాదని అదేవిధంగా ఆన్లైన్ లో పెద్దల ఫోన్లో గేములు, ఆడరాదని, ఆన్లైన్ గేమ్ లు ఆడేటప్పుడు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ,సమాచారాన్ని నమోదు చేయరాదని చిన్న చిన్న బహుమతులు ఇతర బెట్టింగుల జోలికి పోరాదని ఇది మొదట్లో బాగానే అనిపించిన చివరకు విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లు ,సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఖాళీ అయిపోతాయని పేర్కొన్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటని యువకులు బైక్లు నడప రాదని, రాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, అసలు చేయరాదని పెద్దల అనుమతి లేకుండా వారి యొక్క బైకులు తీసుకుని రోడ్డు పైకి వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ లు లేకుండా వేగం నియంత్రణలో లేకుండా బైకులు నడిపితే ప్రమాదాలు జరుగుతాయని ఆ ప్రమాదాల వారితోపాటు అవతలి వైపు బైకులు నడిపిన వారి జీవితాలు కూడా ఇబ్బందుల పాలవుతాయని దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు పోవడమే కాక జీవితాంతం అగటివారిగా జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిఎన్ఎస్ చట్టాల గురించి వివరించారు. ప్రత్యేకించి సమాజంలో స్త్రీల పట్ల నేరాలు స్త్రీ జాతికి ఇబ్బందిగా పరిణమించాయని మాదకద్రవ్యాలు సేవించడం, మత్తు పదార్థాలకు అలవాటు పడడం వల్ల ఎక్కువ శాతం మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని అయితే విద్యార్థులు క్రమశిక్షణతో సమాజంలో తోటి వారితో స్నేహభావంతో మెలిగి బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఎదగాలని తెలియజేశారు. అదేవిధంగా మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి పోస్కో చట్టాలు అమల్లో ఉన్నాయని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారు కానీ లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినవారు కానీ ఎదుటివారైనా ఈ చట్టం పరిధి నుంచి తప్పించుకోలేరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితోపాటు ఆలూరు మోడల్ పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.