మాచనూర్ గ్రామంలో వాటర్ షెడ్ నూతన కమిటీ ఎన్నిక!

మాచనూర్ గ్రామంలో వాటర్ షెడ్ నూతన కమిటీ ఎన్నిక!

నూతన చైర్మన్ గా వి. కుబేర్...

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- గత వైసీపీ ప్రభుత్వంలో వాటర్ షెడ్ కమిటీ ఏర్పాటు చేయడం ఆ ప్రభుత్వంలో పనులు సరిగా చేయకపోవడంతో టిడిపి ప్రభుత్వం పై ఆదేశాల మేరకు హాలహర్వి మండల మాచనూరు గ్రామంలో వాటర్ షెడ్ నూతన కమిటీ నిర్వహించారు, నూతన కమిటీ పిఓ వలిసాబ్ ఆధ్వర్యంలో నూతన వాటర్ షెడ్ కమిటీ చైర్మన్ గా వి. కుబేర్. వైస్ చైర్మన్ డి .నారాయణమ్మ, సెక్రెటరీగా డి రఘువీర్, కమిటీ సభ్యులు, మల్లికార్జున, తిమ్మయ్య, నరసింహులు, లక్ష్మి, వనమ్మ, తిమ్మప్ప, వెంకటేశ్వర్లు గా ఎన్నుకోవడం జరిగింది ,అనంతరం వారికి పూలమాలవేసి సత్కరించారు, జరిగింది అనంతరం పిఓ వలి సాబ్ మాట్లాడుతూ నేటి నుండి ఈ వాటర్ సెడ్ పనులు, వేగవంతంగా చేయాలని,ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యాయని, వెంటనే రైతుల దగ్గర నుండి దరఖాస్తులు సేకరించి వాటర్ షెడ్ పనులు మొదలు పెట్టాలని వారన్నారు. ఈ కార్యక్రమానికి టిడిపి మండల కన్వీనర్ సుధాకర్, హాలహర్వి సర్పంచ్ మల్లికార్జున, పంచాయతీ సెక్రెటరీ ఈరన్న, వాటర్ షెడ్ అధికారులు,జేఈ పురుషోత్తం రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గోవిందప్ప, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్ రెడ్డి, హరి రెడ్డి, శ్రీధర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.