మన గుండెను మనమే కాపాడుకుందాం... జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్
అవగాహన ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించిన ...జిల్లా ఎస్పీ .
గుండె పరిరక్షణకు అందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.
ప్రతిరోజు వ్యాయాయం చేయండి, గుండెను కాపాడుకోండి.
V3 టివి తెలుగు న్యూస్ :
ఆదివారం వరల్డ్ హార్ట్ డే సందర్బంగా కర్నూలు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ల ఆధ్వర్యం లో ఆదివారం ఉదయం కర్నూలు రాజ్ విహార్ సెంటర్ నుండి కర్నూలు కలెక్టరేట్ వరకు గుండె సంబంధిత వ్యాధుల పై అవగాహన ర్యాలీ చేపట్టారు.
ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ముఖ్య అతిధిగా హాజరై , జెండా ఊపి ప్రారంభించారు.
ఈ అవగాహన ర్యాలీ లో పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ మాట్లాడారు.
మన గుండెను మనం కాపాడు కుంటూ ఇతరులను కూడా అప్రమత్తం చేయటానికి ఈ అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు.
అవగాహన ర్యాలీ ని కిమ్స్ హాస్పిటల్ వారు ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమమన్నారు.
40 ఏళ్ళ నుండి 50 ఏళ్ళు పై బడిన వ్యక్తులు అందరూ గుండె సంబంధిత పరీక్షలు చేయుంచుకోవాలన్నారు.
ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్నారు.
ఎదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యను గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిదన్నారు.
జంక్ ఫుడ్ మానేయడం మంచిదన్నారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కొరకు ప్రతి రోజు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం మంచిదన్నారు.
మంచి అలవాట్లతో ఆరోగ్యంగా జీవించ వచ్చన్నారు.
ఇటీవల కాలంలో చిన్న,పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గుండెపోటు రావడం జరుగుతుందనీ, రక్తపోటు,షూగర్ మరియు కొలెస్ట్రాలు సాధారణ మోతాదులో ఉండేలా చూసుకోవాలి కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్ ,స్పెషల్ బ్రాంచ్ ఎస్సై మల్లికార్జున ,కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.