వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి..ఎం.పి బస్తిపాటి నాగరాజు

...వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి..ఎం.పి బస్తిపాటి నాగరాజు

వి 3 తెలుగు టీవీ న్యూస్ కర్నూలు :-


వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు కోరారు.. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడలో ని వరద బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణీ వాహనాన్ని ఎం.పి ప్రారంభించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు లేని విధంగా విజయవాడను వరదలు ముంచెత్తడం బాధాకరమన్నారు.. వరదల కారణంగా అక్కడి ప్రజలు అన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు...రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి పగలు అనే తేడా లేకుండా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారన్న ఎం.పి నాగరాజు.. వరద బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు..