వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-అక్టోబర్ రెండవ తేదీ కర్నూ లు గాంది విగ్రహం ముందు జరిగే నిరసన జయప్రదం చేయాలని కరపత్రాలు విడుదల చేస్తున్న హర్దగేరి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,సిబ్బంది మరియు డి టిఎఫ్ జిల్లా సభ్యులు పొంగలి రమేష్.
డిమాండ్లు చేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని.
1) ప్రభుత్వ విద్యారంగానికి శాపంగా మారిన జీవో నెంబర్ 117 ను తక్షణమే రద్దు చేయాలి
2) ఆంగ్ల భాష మాధ్యమంతో పాటు మాతృభాష మాధ్యమాలను యధావిధిగా కొనసాగించాలి.
3) సి.పి.ఎస్, జి.పి.ఎస్ విధానాలను రద్దు చేయాలి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి
4) విద్యా హక్కు చట్టం - 2009 ప్రకారం రాష్ట్రాల హక్కులను భంగకరంగా ఉన్న విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలి.
5) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే మధ్యంతర భృతి (IR) ప్రకటించి అమలు చేయాలి.