వాల్మీకి బోయ జాతి యస్.టి సాధన కోసం
వి 3tvన్యూస్ హాలహర్వి :-ఆలూరు నియోజకవర్గం లో వాల్మీకి బోయ యువకుల విప్లవ బైక్ యాత్ర బుధువారం హాలహర్వి మండల పరిధిలోని గూళ్యం గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి. బైక్ యాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా పచ్ఛారపల్లి జనార్ధన్ మాట్లాడుతూ వాల్మీకి బోయ జాతి యస్.టి సాధన కోసం మోసపోయిన వాల్మీకి జాతి కోసం వృత్తి లేని వాల్మీకి బోయలకు విద్యాయే వృత్తి దాని సాధించుటకు యస్.టి మన ఆయుధం అని వాల్మీకి యువకుల విప్లవ బైక్ యాత్ర ప్రారంభించడం జరిగింది అని అన్నారు. వాల్మీకి బోయ వారు చదువుకుంటే వాల్మీకి మహర్షి అవుతారు లేకపోతే అణగార్చపడతాడు కార్మికుడైన కర్షకుడైన చివరికి పేదవాడై నా అవుతాడు అలా కాకుండా అందరూ చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని తెలిపారు. పచ్ఛారపల్లి బాపురం వాల్మీకి యువతతో కలిసి ఈ బైక్ యాత్ర హాలహర్వి మండల కేంద్రానికి చేరుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జి. చంద్ర కు వినతి పత్రం వాల్మీకి బోయలు ఏ నేరం చేయకుండానే రౌడీ షీటర్లు మొదలగు షిట్లు కర్నూలు జిల్లాలోని 597 మంది ఉన్నారు. ఆ వివరాలకు జతపరిచి వారికి జీ.వో. యం. స్ 3929, తేది 5-9-1950 పోలీసు అక్ట్ ప్రకారం తొలగించాలి వారి జీవిత మార్పు కోసం సహాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. అలాగే హాలహర్వి మండల కేంద్రంలో ఆర్ యం పి డాక్టర్ నరసప్ప ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్ మాట్లాడుతూ వాల్మీకి బోయలకు ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి యస్. టి జాబితాలో చేర్పించాలి అన్ని విధాలుగా రిజర్వేషన్లు కల్పించాలి జన గణన జరపాలి రౌడీ షీటర్లు మొదలగు సీట్లు ఈ జిల్లాలోని చివరి 5 సంవత్సరాలు ఏ నేరం చేయకుండానే 597 మంది ఉన్నారని తెలిపారు. రాజ్యాంగ హక్కులు సంక్షేమఅభివృద్ధి మరియు సాధికారత కోసం మేం పోరాడుతున్నాం అని అన్నారు 22-9-2024 ఆదివారం రోజున కర్నూలు జిల్లా పరిషత్ హాల్ వాల్మీకి బోయల ఎస్టీ అంశం పైన రాష్ట్రస్థాయి వర్క్ షాప్ సమావేశం జరుగుతుంది కావున వాల్మీకి బోయ సోదరులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయం చేయవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో హోళగుంద మండలం,గూళ్యం వాల్మీకి బోయలు పచ్ఛారపల్లి వాల్మీకి బోయలు వన్నూరు స్వామి, సిద్ధార్థ, ఈరన్న,రమేష్, మధు, చిన్న, హాలహర్వి వాల్మీకి బోయలు గడ్డె గాదిలింగ, ఇతడి గాదిలింగ, అంజి,విరుపాక్షి, పరశురాముడు, వాటర్ రామన్న, నాగరాజు,మల్లి, అంచే గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.