కర్నూలు, పత్తికొండ సబ్ డివిజన్ లలో ఏకకాలంలో దాడులు.
వి 3 టివి తెలుగు న్యూస్ :
కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్, పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్య గారుల ఆధ్వర్యంలో కర్నూలు, పత్తికొండ సబ్ డివిజన్ లలో శనివారం తెల్లవారుజామున పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
రౌడీషీటర్లు, అనుమానస్పద వ్యక్తుల ఇళ్ళల్లో దాడులు నిర్వహించారు.
సారా , అక్రమ మద్యం విక్రయించే వారిని, మట్కా ఆడే వారిని అదుపులోకి తీసుకున్నారు.
కర్నూలు, పత్తికొండ సబ్ డివిజన్ లలో ఎలాంటి ధ్రువ పత్రాలు లేని 25 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.
ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.