ఎన్టీఆర్ దేవర సినిమాలో పెళ్ళికొడుకు పాత్ర పోషించిన కొత్తవలస యువకుడు విశ్వనాధ హరికుమార్

ఎన్టీఆర్ దేవర సినిమాలో పెళ్ళికొడుకు పాత్ర పోషించిన కొత్తవలస యువకుడు విశ్వనాధ హరికుమార్

 కొత్తవలస : కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ మరియు జాహ్నవి కపూర్ నటించిన దేవర పాన్ ఇండియా సినిమాలో విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన విశ్వనాథ హరికుమార్ పెళ్లి కొడుకు పాత్ర పోషించారు... క్యారెక్టర్ చిన్నది అయినప్పటికీ పాన్ ఇండియా సినిమాలో విజయనగరం జిల్లాలో కొత్తవలస ప్రాంతంలో వ్యక్తికి అవకాశం రావడం నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.. స్థానిక రాజా థియేటర్ వద్ద నందమూరి అభిమానులు విశ్వనాధ హరికుమార్ కు బ్యానర్లతో ధన్యవాదాలు తెలిపారు...విశ్వనాధ హరి కుమార్ మాట్లాడుతూ దేవర సినిమాలో నాలుగు రోజు పాడేరులో మరియు రెండు రోజుల వికారాబాద్ అడవుల్లో నా పాత్ర యొక్క షూట్ జరిగాయని అన్నారు.. ఈ యొక్క అవకాశం ఇప్పించిన వైజాగ్ కాస్టింగ్ ప్రసాద్,వీరు,శేషు,రెడ్డి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.. ఈ సినిమాలో నన్ను ఈ విధంగా చూపించిన డైరెక్టర్ కోరాటాల శివ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అసోసియేట్ డైరెక్టర్ మల్లికార్జున్ గారికి, అసిస్టెంట్ డైరెక్టర్ గణపతి గారికి, కెమెరా డిపార్ట్మెంట్ సాంబ గారికి దేవర టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.. అదేవిధంగా 2015 నుంచి సినిమా పరిశ్రమంలో ఉన్నారని వైజాగ్ వారితో రెండు సినిమాల్లో క్యారెక్టర్ రోల్ చేశానని,సుమారు 35 షార్ట్ ఫిలిమ్స్ లో హీరోగా చేశారని... ఈటీవీ మరియు జెమినీ సీరియల్స్ లో కూడా సపోర్టింగ్ రోల్ చేశారని, కమిటీ కుర్రోళ్ళు సినిమాలో పెద్దబాబు క్యారెక్టర్ చేసిన ప్రసాద్ బెహరా ఛానల్ లో కూడా తన చేశారని బజాజ్ ఎలక్ట్రానిక్ ఏ.సీ ఆడ్ లో కూడా చేశారని అన్నారు... రానున్న రోజుల్లో ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నారని పాత్ర ఎలాంటిదైనా ఆ యొక్క క్యారెక్టర్ కి న్యాయం చేసే విధంగా ఉంటానని అన్నారు...