వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండలంలోని రైతులకు తెలియజేయడమేమనగా రబి సీజన్ గాను విత్తనాలను సబ్సిడీకి అందించనున్నారు ఇందులో భాగంగా శనిగలు జేజి లెవెన్ రకం ఫుల్ కాస్ట్ 94 రూపాయలు 25% సబ్సిడీ పోను 70.50 రూపాయలు
మొత్తం శనిగలు 3250 క్వింటాళ్లు మన మండలానికి అలాట్ అయినవి. ప్రతి రైతు సేవా కేంద్రంలో కావలసిన రైతులు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే వీళ్లకు శనిగలు తెప్పించబడును. వ్యవసాయ అధికారి శివశంకర అన్నారు. అక్టోబర్3 వ తారీకు నుంచి శనిగలు రైతులకు అందుబాటులో ఉంచబడును మరియు ఇవ్వబడును.శనిగలు క్వింటాకు 7050/- రూపాయలు రైతులు కట్టవలసినది ఒక ఎకరాకు ఒక బ్యాగు అనగా 25 కేజీలు మాక్సిమం ఒక రైతుకు ఐదు బ్యాగుల వరకు 5 ఎకరాల వరకు ఇవ్వబడును..
మరియు వేరుశనగ బుడ్డలు 225 క్వింటాళ్లు K6 రకం అలాట్ అయినవి కావలసిన రైతులు ముందుగా డబ్బులు కట్టితే వాళ్లకు వేరుశనగ కాయలు నిలువంచుతామన్నారు.