వరద బాధితులకు సాయమందించడం అభినందనీయం- మంత్రి టీజీ భరత్

వరద బాధితులకు సాయమందించడం అభినందనీయం- 
మంత్రి టీజీ భరత్

V 3 టివి తెలుగు న్యూస్ : 

కర్నూలు, సెప్టెంబర్ 23 : 
విజయవాడ వరద బాధితులకు సాయమందించడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి టీజీ భరత్ అన్నారు. స్థానిక అశోక స్టడీ సర్కిల్ అధినేత శ్రీధర్ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50,000 ల చెక్ ను మంత్రి టీజీ భరత్ కు అందించారు. 
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల భాగస్వామ్యoతో విరాళం అందించడం చాలా గొప్ప విషయమని అన్నారు. అశోక స్టడీ సర్కిల్ వారి ఔదార్యాన్ని ప్రతి వారూ స్ఫూర్తిగా తీసుకోవాలని టీజీ భరత్ కోరారు. అశోక స్టడీ సర్కిల్ అధినేత శ్రీధర్ మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్ ఇచ్చిన పిలుపు మేరకు తాము వెంటనే స్పందించి తమ వంతు బాధ్యతగా తమ సంస్థలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సహకారంతో విరాళం అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.