వి 3 టిబి తెలుగు న్యూస్ ;
కర్నూలు జిల్లా గూడూరు మండలం నాగలాపురం గ్రామంలోని సుంకులమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఎం.పి బస్తిపాటి నాగరాజు దర్శించుకున్నారు.. దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఎం.పి కి స్థానిక టిడిపి నాయకులు, గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. సుంకులమ్మను దర్శించుకున్న ఆయన, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఎం.పి నాగరాజు కి వేదాశీర్వచనాలను అందించి , అమ్మ వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు సురేష్, గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, తిరుపల్, సుంకన్న ,మద్దిలేటి, చిన్న గిడ్డయ్యలు పాల్గొన్నారు..