రైతులకు శనగ విత్తనాల పంపిణీ..వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-

రైతులకు శనగ విత్తనాల పంపిణీ.

.వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి రైతు సేవ కేంద్రంలో రబీకి సిద్ధమైన రైతులకు
అవసరమైన విత్తన సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శనివారం నుంచి శనగ విత్తనాల పంపిణీ ప్రారంభించింది.. మిగిలిన వేరుశనగ విత్తనాలను పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. రబీలో శనగ సాగవుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ దూరంగా ఉన్న రైతులు ముందస్తు రబీలో శనగ సాగువైపు మొగ్గు చూపుతుండటంతో ఈసారి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. కావున రైతు సేవ కేంద్రంలో శనగ విత్తనాలు ఈ కార్యక్రమంలో ఆలూరు టిడిపి నేత వీరభద్ర గౌడ్, ఎంపీడీవో వరలక్ష్మి, తాసిల్దార్ నజ్మా భాను, మండల వ్యవసాయ అధికారి శివశంకర్, డిప్యూటీ తాసిల్దార్ లక్ష్మి, సర్పంచ్ మల్లికార్జున, టిడిపి మండల అధ్యక్షుడు సుధాకర్, మండల క్లస్టర్ పాల్ రెడ్డి,బిజెపి మండల అధ్యక్షుడు బసవరాజు,నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.