నిట్రవట్టి నుండి ఆలూరు రహదారి గ్రావెల్స్ తో మరమ్మతులు...


నిట్రవట్టి నుండి ఆలూరు రహదారి గ్రావెల్స్ తో మరమ్మతులు...

V 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామం నుండి ఆలూరు కి వెళ్లే రహదారి గ్రావెల్స్ తో,ఆలూరు నుంచి హొళగుంద రోడ్డు వరకు నాలుగు కిలోమీటర్లు రోడ్డు గుంతలు అవడంతో సర్పంచ్ గాదిలింగప్ప గ్రావెల్స్ తో గుంతలను పూడ్చడం జరిగింది. హలహర్వి,గూళ్యం,పచ్చరపల్లి,బాపురం, కర్ణాటక నుండి నిట్రవట్టి, నుండి దసరా బన్నీ ఉత్సవాలకు మా గ్రామం నుండే వెళ్తున్నారు,కావున భక్తులకు ఇబ్బందులు లేకుండా గ్రావెల్స్ రోడ్డు వేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నరసప్ప, నాగరాజు, తిప్పే స్వామి, గాదిలింగ, అంబ్రిష్ తదితరులు పాల్గొన్నారు..