పోస్టల్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

పోస్టల్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.. 

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- పోస్ట్ ఆఫీస్ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, పోస్ట్ మాస్టర్ భాస్కర్ అన్నారు, ఈ సందర్భంగా హాలహర్వి మండల కేంద్రంలో పోస్టర్ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, పోస్టల్ సిబ్బందితో గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు ,అనంతరం పోస్ట్ మాస్టర్ భాస్కర్ ,మాట్లాడుతూ, పోస్టల్ వారోత్సవాలు గత 20 రోజులు నుండి కొనసాగుతున్నాయని ఈ వారోత్సవాలు భాగంగా ప్రతి మండల కేంద్రంలో పోస్టల్ వారోత్సవాలు నిర్వహించాలని, గ్రామంలో ప్రతి ఒక్కరూ పోస్టల్ పథకాలను పొంది తద్వారా ఎన్నో ప్రయోజనాలు ప్రజలు పొందాలని వారన్నారు,
ఈ కార్యక్రమానికి పోస్టల్ సిబ్బంది, పృద్వి ,శ్రావణి ,మాధురి , ప్రహల్లాద స్వామి, బ్రాహ్మణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.