• వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ... జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్.
V 3 టివి తెలుగు న్యూస్ :
జిల్లా పోలీసు కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.
వాల్మీకి చిత్రపటానికి జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.
వాల్మీకి మహర్షి రచించిన రామాయణం స్పూర్తితో ప్రతి ఒక్కరూ మానవతా విలువలను , ఉన్నతమైన ఆదర్శ భావాలను పెంపొందించుకోవాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్ హోమ్ గార్డ్ కమాండెంట్ ఎం. మహేష్ కుమార్, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ , ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ ఐలు సోమశేఖర్ నాయక్, నారాయణ, జావేద్ , ఆర్ ఎస్సైలు, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.