వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండల కేంద్రంలో మంగళవారం రైతు భరోసా కేంద్రంలో గ్రామస్థాయి అధికారులు, రైతులతో సమాచార హక్కు చట్టాలపై అవగాహన సదస్సు వ్యవసాయ అధికారి శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థాయి అధికారులు రైతులతో ఆయన మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఆఫీసులో అధికారులు ప్రతి పౌరులకు ప్రజలకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని, ఒకవేళ సమాచారం ఇవ్వకపోతే సమాచారం హక్కు చట్టం సమాచారం ఇవ్వాలని పై స్థాయి అధికారులకు అప్లై చేయొచ్చని అన్నారు, ఈ కార్యక్రమానికి గ్రామస్థాయి అధికారులు రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.