రైతులకు తగు జాగ్రత్తలుపొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ శాఖ అధికారి శివ శంకర్

రైతులకు తగు జాగ్రత్తలు

పొలం పిలుస్తుంది కార్యక్రమం 

మండల వ్యవసాయ శాఖ అధికారి శివ శంకర్ 
 
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- హాలహర్వి మండలంలోని మంగళవారం శిరుగాపురం, చింతకుంట గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి శివశంకర్, వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల అధికారులు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఉద్యాన శాఖ అధికారి ఇంద్రజ గ్రామ సభలో పాల్గొన్న రైతులకు వ్యవసాయ సలహాలు సూచనలు తెలియజేశారు. ఎంపీఈఓ రవికుమార్, రవి శేఖర్ పాల్గొన్నారు.
రాబోయే వర్షాలకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు.వాతావరణ శాఖ ద్వారా తెలిపిన సమాచారం మేరకు ఈ నెల 17 వ తేది వరకు వర్ష సూచన ఉంది. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రస్తుత పంటలను కాపాడుకోవాలి.వరి పంట వర్షం ఎక్కువైతే, పొలాల్లో నీరు నిలబడకుండా బయటికి పంపాలి. వీలైనంత వరకు ఇప్పుడు పైపాటి ఎరువులు వేసుకోకూడదు, అవసరం అయితే వర్షం తగ్గిన తర్వాత పైపాటి ఎరువులు వేసుకోవాలి.
వేరుశనగ పంట కోతలు పూర్తి అయి ఉంటే వేరుశనగ కాయలు తడవకుండా టార్పాలిన్స్ తో కప్పి ఉంచుకోవాలి. ఒకవేళ కోతకు సిద్దంగా ఉంటే వర్షం తగ్గిన తర్వాత కోతలు చేసుకోవాలి.
పత్తి పంట పత్తి తీతలు చివరి దశలో ఉన్నాయి కాబట్టి, ఈ చివరి తీతను వాయిదా వేసుకోవాలి. లేదా త్వరగా చివరి తీత పూర్తి చేసుకొని, తీసుకొన్న పత్తి వర్షం లో తడవకుండా కాపాడుకోవాలి.
పప్పు శనగ పంటలు వీలైనంత వరకు పప్పు శనగను వర్షాలు తగ్గిన తర్వాత విత్తుకుంటే మంచిది. పప్పు శనగ పంటను అక్టోబర్ 15 తర్వాత విట్టుకుంటే మంచిది.కంది పంటలు కంది ప్రస్తుతం మొగ్గ నుండి పూత దశలో ఉంది కాబట్టి, వర్షాలు ఎక్కువై ఎక్కడైనా పొలాల్లో నీరు నిలబడితే, పొలం గట్లను తెంచి నీటిని బయటికి పంపాలి. లేకపోతే వేరు కుళ్ళు, ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.