• నేరాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలి.
• పోలీసు స్టేషన్ రికార్డులను పరిశీలించిన ... జిల్లా ఎస్పీ.
V3 టివి తెలుగు న్యూస్ :
తుగ్గలి పోలీసు స్టేషన్ ను కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ శుక్రవారం వార్షీక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు, వాటి పురోగతి పై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు.
ముఖ్యమైన కేసులు, పాత గ్రేవ్ కేసులను సమీక్షించారు.
ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
బాధితులు పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు.
పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
సైబర్ నేరాల పై, మహిళ చట్టాల పై, నూతన చట్టాల పై ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలకు అవగాహన చేయాలన్నారు.
జిల్లా ఎస్పీ తో పాటు పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య , ట్రైనీ డిఎస్పీ ఉష శ్రీ, సిఐలు ప్రసాద్, గుణశేఖర్ బాబు, పులిశేఖర్, తుగ్గలి ఎస్సై క్రిష్ణమూర్తి ఉన్నారు.