విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం... కర్నూలు జిల్లా ఎస్పీజి. బిందు మాధవ్ .

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం... కర్నూలు జిల్లా ఎస్పీజి. బిందు మాధవ్ .

• ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 48 ఫిర్యాదులు .

• ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన ... జిల్లా ఎస్పీ. 

V 3 టివి తెలుగు న్యూస్ : 



కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 48 ఫిర్యాదులు వచ్చాయి.

వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ...

1) నేను బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. తెలిసిన వ్యక్తి ద్వారా హైదరాబాదులో ఉన్న హరి ప్రసాద్ రెడ్డి , హైదరాబాదులో ఐటీ సాఫ్ట్ వెర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర నుండి రూ . 2 లక్షల 30 వేలు తీసుకొని మోసం చేశాడని దేవనకొండ మండలం, బేతపల్లి గ్రామం కు చెందిన శివకేశవరెడ్డి ఫిర్యాదు చేశారు.

2) నా కుమారుడు, నా కోడలు ఆస్తులు రాసి ఇవ్వాలంటూ నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రాణ రక్షణ కల్పించి మాకు న్యాయం చేయాలని కర్నూలు, పాతబస్తీ కి చెందిన జె . సరస్వతి ఫిర్యాదు చేశారు. 


3) నకిలీ పట్టాలు ఇచ్చి డబ్బులు తీసుకొని మోసం చేసిన కొందరు అధికారుల పై చర్యలు తీసుకోవాలని చట్టపరంగా న్యాయం చేయాలని కర్నూల్ , వీకర్ సెక్షన్ కాలనికి చెందిన వి. వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. 

4) నన్ను కొట్టి , నా ఇంట్లో కి నన్ను రానివ్వకుండా ఆస్తి ని ఆక్రమించు కోవాలని మా బంధువులు బెదిరిస్తున్నారని, నాకు రావాల్సిన ఇంటి కిరాయి డబ్బులు కూడా రానివ్వకుండా చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని ఆదోని కి చెందిన సంగీత భాయి ఫిర్యాదు చేశారు. 

5) నా దగ్గర నుండి 59 క్వింటాల శనగల ఉయ్యాలవాడకు చెందిన నాగేశ్వర్ రెడ్డి కొనుగోలు చేసి తీసుకున్నాడు. డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని ఓర్వకల్లు మండలం , లొద్దిపల్లి గ్రామానికి చెందిన మహదేవుడు ఫిర్యాదు చేశారు. 

6) ఈ పొలం నాదే అంటూ , మా పొలంలో వేసిన మునగ పంట పైరు నాశనం చేసి, దాదాపు 2 లక్షలు నష్టం వచ్చేటట్టు చేసిన నాయకల్లు గ్రామానికి చెందిన పెద్ద సుబ్బన్న పై చర్యలు తీసుకోవాలని కల్లూరు మండలం, దూపాడు గ్రామానికి చెందిన మహేష్ ఫిర్యాదు చేశారు. 

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీజి. బిందు మాధవ్ హామీ ఇచ్చారు.

ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, సిఐ మధుసుధన్ రావు పాల్గొన్నారు.