గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి భూమి వేలం పాట..
సర్పంచ్, గ్రామ పెద్దలతో పారిశుద్ధ కార్మికులకు సన్మానం..
పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాను విద్యార్థినికి సన్మానం..
రామ దేవాలయం అభివృద్ధికి దుకాణాలపై వేలం పాట..
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- మండల కేంద్రంలో శ్రీరామ దేవాలయం గుడి ఆవరణలో సర్పంచ్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం కి సంబంధించిన 24 ఎకరాల గల భూమిని వేలంపాట సర్పంచ్ తండ్రి నరసప్ప సర్పంచ్ మల్లికార్జున, గ్రామ పెద్దలు వెంకటేశ్వర రెడ్డి , కిష్టప్ప, గోపాల్, ప్రసాద్ ,వారిఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. ఈ సందర్భంగా నరసప్ప మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం సంబంధించిన 24 ఎకరాల భూమి గల వేలంపాట 2,60,000 వేల రూపాయలు సెండు పూల్ కిషోర్ దక్కించుకున్నారని ఇలాగే ప్రతి సంవత్సరం వేలంపాట మొదలవుతుందని అందుకు గ్రామంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వేలంపాట దక్కించుకోవాలని ఆయన అన్నారు పారిశుద్ధ కార్మికులకు ఆంజనేయులు, గోవిందు వారికి గ్రామ పెద్దలు వెంకటేశ్వర రెడ్డి,గోపాల్, కిష్టప్ప, ప్రసాద్, వారి చేతుల మీదుగా పారిశుద్ధ కార్మికులకు, శాలువాలు కప్పి పూలదండలతో సన్మానించారు, అనంతరం మండలంలోని ప్రధమ స్థానం లో సాధించిన, పదవ తరగతి ఉత్తీర్ణత లో మాచన్నూర్ గ్రామానికి చెందిన దలవాయి బసవరాజు కూతురు దలవాయి హుస్సేన్ మ్మ ను,సర్పంచ్ తండ్రి నరసప్ప గ్రామ సభలో ఆహ్వానించి ఆ విద్యార్థికి ఆమె తండ్రికి ఘనంగా సన్మానించారు,ఈ విద్యార్థి కలెక్టర్ అయ్యేవరకు చదివిన ఆ చదువుకు నేను ఎంతైనా సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు , అనంతరం శ్రీ రామ దేవాలయం అభివృద్ధికి ప్రక్కనున్న దుకాణాల వేలం పాట, మొదలు కావడంతో, 3,60,000 వేల రూపాయలు శ్రీధర్ దక్కించుకున్నారు, ఈ కార్యక్రమానికి గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.