వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండల పరిధిలోని పచ్ఛారపల్లి గ్రామంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి ఏఓ శివశంకర్, ఎంపిటిసి సభ్యులు, మండల క్లస్టర్ ఇంచార్జి ప్రహ్లాద రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖ, గ్రామ రైతులు పండిస్తున్న పంటలు వరి, జొన్న, కందులు, మెరప, పత్తి పంటలు రైతులకు దుక్కి దున్నేటప్పుడు ,నుండి పంటలు మార్పులు గురించి విత్తన శుద్ధి మందులు ,నీరు పెట్టడం, బయటికి వదలడం, మందులు పిచికారి, పంటలు నూర్పిడి, వ్యవసాయ సలహాలు సూచనలు ఏఓ శివశంకర్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ అగ్రికల్చర్ విజయ్ ,టిఎన్ఎస్ఎఫ్ ఆలూరు తాలూకా అధికార ప్రతినిధి పచ్ఛారపల్లి జనార్ధన,రాజన్న రెడ్డి,రాజశేఖర్ రెడ్డి,నరసప్ప సోమశేఖర్ రెడ్డి ,పాండురంగారెడ్డి, రాజ పంపా రెడ్డి,ఈశ్వరప్ప,గాదిలింగప్ప,దేవేంద్రప్ప, తదితరులు రైతులు పాల్గొన్నారు.