• ఎంతటివారి నైనా ఉపేక్షించేది లేదు.
• చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
• నిష్పక్షపాతంగా దర్యాప్తు పూర్తి చేస్తాం.
V 3 టివి తెలుగు న్యూస్ :
పెద్దకడుబూరు మండలం, కల్లు కుంట గ్రామం లో గోవిందమ్మ పై జరిగిన దాడి సంఘటన విషయం పై జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ మంగళవారం కల్లుకుంట గ్రామం ను సందర్శించారు.
కల్లుకుంట గ్రామంలోని గోవిందమ్మ ఇంటి కి వెళ్ళి గోవిందమ్మను పరామర్శించారు.
నేర సంఘటన స్ధలాన్ని జిల్లా ఎస్పీ గారు క్షుణ్ణంగా పరిశీలించారు.
బాధితురాలైన గోవిందమ్మ కు న్యాయం చేస్తామన్నారు. నిందితు ల పై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
దర్యాప్తు ను నిష్పక్షపాతంగా చేస్తామన్నారు.
గోవిందమ్మ కు భద్రత కల్పిస్తామన్నారు. బాధితురాలికి న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు.
ఈ దాడి కేసులో పాల్గొన్న కొంతమంది ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఇంకా కొంతమంది ముద్దాయిలను గుర్తించే పని లో ఉన్నామన్నారు.
కల్లుకుంట్ల గ్రామంలో 24 X 7 పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
కల్లుగుంట గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ గట్టి చర్యలు తీసుకోవాలని ఎమ్మిగనూరు డిఎస్పీ కి, పెద్ద కడుబూరు పోలీసు అధికారులను ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఎమ్మిగనూరు డిఎస్పీ ఉపేంద్రబాబు, స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్, కోసిగి సిఐ మంజునాథ్ , ఎమ్మిగనూరు రూరల్ సిఐ విక్రమసింహా, ఆదోని రూరల్ సిఐ నల్లప్ప, పెద్దకడుబూరు ఎస్సై నిరంజన్ , స్పెషల్ బ్రాంచ్ ఎస్సై వేణుగోపాల రాజు ఉన్నారు.