బేవినహాల్, కొక్కర చేడు,గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం..

బేవినహాల్, కొక్కర చేడు,గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం..
 
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండలంలోని బుధవారం బేవినహాల్, కొక్కర చేడు గ్రామాలలో పొలం,పిలుస్తోంది కార్యక్రమం వ్యవసాయ అధికారి శివశంకర్ అద్వర్యంలో గ్రామసభ నిర్వహించారు .
ఈ సమావేశానికి బేవినహాల్ సర్పంచ్ జయశ్రీ ,కొక్కర చేడు సర్పంచ్ మన్మధ రెడ్డి, మరియు ముఖ్యఅతిథిగా టిడిపి కన్వీనర్ సుధాకర్ కార్యక్రమం హాజరై రైతులకు శనిగ విత్తనాలు ప్యాకెట్లు, పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఏవో శివశంకర్ మాట్లాడుతూ గ్రామ సభలో పాల్గొన్న రైతులకు వ్యవసాయ సలహాలు సూచనలు తెలియజేశాము ఈ కార్యక్రమానికి ఎంపీఈఓ జయకుమార్ రైతులు తదితరులు పాల్గొన్నరు.