వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వం ధ్యేయం కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 14వ తేదీ నుండి పల్లె పండుగ అనే వారోత్సవాల్లో భాగంగా హాలహర్వి మండల పరిధిలోని సోమవారం బిలేహాల్, విరుపాపురం గ్రామాల్లో ఎంపీడీవో వరలక్ష్మి పల్లె పండుగ ఈ కార్యక్రమంలో గోకులం షెడ్, సిసి రోడ్లు పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రెటరీ ,కార్యదర్శిలు, సచివాలయం సిబ్బంది, తెలుగుదేశం ,జనసేన ,బిజెపి, నాయకులు టిఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, బివిజీ టీం, యువత నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.