*_నేపాల్‌లోని ఖాట్మండు లోయలో స్వయంభూగా వెలసిన ఈ పవిత్ర శివవిష్ణు మిళిత సయన నారాయణ విగ్రహాన్ని దర్శించి పూజలు చేసిన మాజీ మంత్రి ఆర్.కె.రోజా గారు_*
బుధానీలకంఠ దేవాలయం, నేపాల్‌లోని బుధనీలకంఠలో ఉంది. ఇది మహావిష్ణువుకు అంకితం చేయబడిన హిందువుల పవిత్ర ఆలయం. ఈ దేవాలయం ఖాట్మండు లోయకు ఉత్తరాన ఉన్న శివపురి కొండకు దిగువన ఉంది. మహావిష్ణువు పెద్ద శేషనాగుపై శయనిస్తూ ఉన్న విగ్రహం ఇక్కడ కొలువుదీరి ఉంటుంది.
మహావిష్ణువు & శివుడు కలిసిన స్వయంభూ లింగమని కూడా అంటారు. శంఖు చక్ర గదతో బాటు చేతిలో విభూది ఉండను కలిగి, చేతులు, తలపై నాగాభరణాలు కలిగిన అద్భుత విగ్రహమిది.
బుధనీలకంఠ ఆలయ ప్రధాన విగ్రహం నేపాల్‌లో అతిపెద్ద రాతి శిల్పంగా పరిగణించబడుతుంది.
కార్తీక ఏకాదశి పర్వదిన సంధర్భంగా శివవిష్ణువుల కలయిక ఐన ఈ "బుధా నీలకంఠ నారాయణ" స్వామి ఆలయాన్ని సంధర్శించిన మాజీ మంత్రి ఆర్.కె.రోజా గారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.