వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- ఈనెల 18వ తేదీన కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ వద్ద లో నిర్వహిస్తున్న ఆశ వర్కర్ల ధర్నాను జయప్రదం చేయాలని, సిఐటియు జిల్లా కార్యదర్శి నారాయణస్వామి సిఐటియు మండల కార్యదర్శి కృష్ణ అన్నారు, ఈ సందర్భంగా హాలహర్వి మండల కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ తిమ్మలేష్ చేతికి ఆశా వర్కర్ల ధర్నాకు అనుమతి ఇవ్వాలని వినతిపత్రం అందించారు, అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నారాయణస్వామి మాట్లాడుతూ,ఆశ వర్కర్ల డిమాండ్స్ ను సమస్యలను పరిష్కరించాలని కోరారు..
1. 09.02.2024 ప్రభుత్వం ఎపి ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రతినిధి వర్గంతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జివోల అమలు విడుదల చేయాలి.
2. ఆశా వర్కర్స్ కనీస వేతనం 26వేలు ఇవ్వాలి.
3. యన్.సి.డి. సర్వేలు రద్దుచేయాలి..
4. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని ఆశాలుగా మార్పువేయాలి.
5. పనిభారాన్ని తగ్గించాలి. మొబైల్ వర్క్ శిక్షణలవ్వాలి. రికార్డ్స్ లేదా ఆన్లైన్, ఒక వర్కే చేయించాలి.
6. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. (ఏ కారణంతో మరణించిన)
7. రిటైర్మెంట్ నిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి. వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి.
8. ప్రభుత్వ శెలవులు, మెడికల్ లీవ్, వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్ అమలు చెయ్యాలి.
9. 62 సం॥ల రిటైర్మెంట్ జిఓని వర్తింపచెయ్యాలి.
10. సంక్షేమ పధకాలు అమలు చెయ్యాలి.
11. కోవిడ్ కాలంలో (2020 మార్చి నుండి) మరణించిన ఆశాలకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియో
ఇవ్వాలి. కుటుంబంలో అర్హులైన వారిని అశాలుగా తీసుకోవాలి.
12. ఎఎన్ఎం, హెల్త్ సెక్రటరీల నియామకాలలో ఆశాలకు వెయిటేజీని ఇవ్వాలి.
13. ఒక్కవేయ్యి జనాభాకు ఒక ఆశా వర్కర్ను నియమించాలి.
14. అర్బన్ ప్రాంతాలలోవిధులు నిర్వహిస్తున్న వారందరికి తమ గ్రామాలకు, వార్డులకు బదిలీ చేయాలి.ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్లు మండల అధ్యక్షురాలు విజయలక్ష్మి, ఉపాధ్యక్షురాలు శివమ్మ, తదితరులు పాల్గొన్నారు