వైయస్సార్ పార్టీ బలోపితానికి మండల స్థాయిలో గ్రామ కమిటీలు,

వైయస్సార్ పార్టీ బలోపితానికి మండల స్థాయిలో గ్రామ కమిటీలు,
కూటమి ప్రభుత్వం అరాచకాలను అణచివేయాలి, ఎమ్మెల్యే విరుపాక్షి,

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- వైయస్సార్ పార్టీ బలోపితాం చేయడానికి మండల స్థాయిలో గ్రామ కమిటీలు, వేయాలని అలాగే కూటమి ప్రభుత్వం అరాచకాలను అణచివేయాలి, ఎమ్మెల్యే విరుపాక్షి, అన్నారు ఈ సందర్భంగా హాలహర్వి చేత్రగుడి దేవాలయ నందు మండల స్థాయి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు,ఈ సమావేశంలో MLA మాట్లాడుతూ.ఆలూరు నియోజకవర్గం లోని ప్రతి ఒక్క వైస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు ఇకనుండి కూటమి ప్రభుత్వ చేస్తున్న విధ్వంస రాజకీయానికి ఎదురు నిలబడి ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మంచి చేశారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో విధ్వంసపాలన కి చమర గీతం పాడాలని రాబోయే రోజుల్లో పార్టీ బలోపితానికి మనమందరం కలిసికట్టుగా ఉండి పార్టీని బలంగా సంసిద్ధం చేసుకోవాలని , నాయకులకు, ప్రతి కార్యకర్త లకు ఆదేశించారు. అలాగే టిడిపి ప్రభుత్వంలో ఏ ఉపాధి కావాలన్నా, ఏ ఉద్యోగం కావాలన్న , లక్షలు లో వ్యవహారం జరుగుతుందని తెలిపారు. వైయస్సార్ ప్రభుత్వం మద్యపానం నిషేధం చేయాలని అంచలంచెలుగా మద్యం తగ్గించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ టిడిపి ప్రభుత్వంలో మండలంలో గ్రామాలు లో మద్యమం వీధి వీధినా ఏరులై పార్తుందని తెలిపారు. అలాగే గ్రామాలలో బెల్ట్ షాపులు కావాలంటే లక్ష రూపాయలు, ఉపాధి ఫిల్ అసిస్టెంట్ రెండు లక్షలు, డీలర్ షిప్ కావాలంటే మూడు లక్షలు, ఒక్క పదవికి ఒక్కో రేటు పలుకుతుందని ఎమ్మెల్యే విరుపాక్షి విమర్శించారు. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నడిపేమని తెలిపారు.. టిటిడి ప్రభుత్వంలో లక్షలు లో వసూలు చేస్తున్నారని తెలిపారు.. అలాగే జమలీ ఎలక్షన్ అందుకొరకు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు తెలిపారు. అదేవిధంగా ప్రతి మండలంలోని గ్రామ,మండల నియోజకవర్గ కమిటీలు వేయడం ద్వారా నాయకులలో ఉత్సాహం రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హాలహర్వి మండలం కన్వీనర్ రామిరెడ్డి,వైస్సార్సీపీ రాష్ట్ర కో కార్యదర్శి, జనార్దన్ నాయుడు ఎంపీపీ నెట్టకంటమ్మ, వైస్ MPP నాగేష్, కో కన్వీనర్ మల్లికార్జున, మండల యూత్ అధ్యక్షుడు గంగాధర, సీనియర్ నాయకులు తిప్పారెడ్డి, అర్ధగిరి శ్రీనివాసులు, పరుశురాం,గోపాల్, లింగప్ప, కృష, రామయ్య,సుంకన్న,శేఖన్న, దిబ్బ లింగ,మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.