మాదిగల ఆత్మీయ సమ్మేళన సదస్సును జయప్రదం చేయాలి!

మాదిగల ఆత్మీయ సమ్మేళన సదస్సును జయప్రదం చేయాలి!వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-ఈనెల 18 న కర్నూల్ లో నిర్వహించనున్న ఉమ్మడి కర్నూలు జిల్లా మాదిగల ఆత్మీయ సమ్మేళన సదస్సుకు పెద్ద ఎత్తున మాదిగ సోదరులు తరలివచ్చి విజయవంతం చేయాలని జిల్లా ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి ఉపాధ్యక్షుడు ముత్యాల గాదిలింగ పిలుపునిచ్చారు.గురువారం హలహర్వీ మండల కేంద్రం ఆర్డిటి భవనం ముందు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఉచ్చిరంగప్ప,గంగాధర్, బిలేహళ్ మల్లయ్య,గ్రామ అధ్యక్షుడు మహేష్ తదితర ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి జిల్లా ఉపాధ్యక్షుడు ముత్యాల గాదిలింగ కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ముత్యాల గాదిలింగ మాట్లాడుతూ భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలు పై ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఏపీలో గ్రూప్1,డిఎల్,జేఎల్, డీఎస్సీ,పోలీస్ కానిస్టేబుల్లు పోస్టుల భర్తీ నియామక ప్రక్రియను ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలయ్యేంతవరకు నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తమ అధినేత,ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సానుకూల దృక్పత్వంతో విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పారు.ఈనెల 18న కర్నూల్ లో జరిగే కర్నూల్,నంద్యాల ఉమ్మడి జిల్లాల మాదిగల ఆత్మీయ సమ్మేళన సదస్సు ముఖ్య అతిథులుగా మందకృష్ణ మాదిగ హాజరుకానున్నారని పేర్కొన్నారు.విశిష్ట అతిథులుగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ,ఏపీ రాష్ట్ర ఎంఎస్పి అధ్యక్షులు విశ్వనాథ్ మాదిగ,ఏపీ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగలు హాజరుకానున్నారని చెప్పారు.కనుక జిల్లాలో ఉన్న మాదిగ,మాదిగ ఉపకులాల ప్రజాస్వామిక వాదులు,ఎమ్మార్పీఎస్,ఎం �