వివాహం చేయడం లేదని, తండ్రిని రూమ్ లో బంధించి చితకబాదిన ఘటన

వివాహం చేయడం లేదని, తండ్రిని రూమ్ లో బంధించి చితకబాదిన ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

మంత రాజు (65) అనే వ్యక్తి కిరణం షాపు పెట్టుకొని, జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. 

ఇందులో పెద్ద కూతురుకు వివాహం కాగా మరో ముగ్గురుకి నలభై ఏళ్ళు దాటినా వివాహం చేయడం లేదని తండ్రి రాజు ను నిత్యం వేధిస్తూ ఉన్నారు.

కుమారులు తండ్రి మధ్య మాట మాట పెరగడంతో ఇంట్లో ఒ రూమ్ లోకి తండ్రిను లాక్కొని కుమారులు నిలకంఠ, జగదీష్ లు విచక్షణారహితంగా కట్టెలతో తండ్రిపై దాడి చేసి రెండు కాళ్లు విరగ్గొట్టారు.

వెంటనే ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు గమనించి, రాజును వెంటనే ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొరకు కర్నూలుకు తరలించారు.