విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం... కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ .
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 107 ఫిర్యాదులు .
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన ... జిల్లా ఎస్పీ.
కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో బి..బిందు మాధవ్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 107 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ...
1) ఎమ్మిగనూరు నుండి మంత్రాలయం కు వెళ్ళే రోడ్డు లో మూడున్నర ఎకరాల పొలం కు రూ. 20 లక్షలు కట్టాము. డబ్బులు తీసుకున్న ఆంజనేయులు మరియు కొందరు వ్యక్తులు కలిసి మోసం చేశారు. పొలం పాసు పుస్తకాలు ఇవ్వకుండా, పొలం రిజిస్ట్రేషన్ చేయకుండా, వేరే వారికి అమ్మి వేసి మోసం చేశారు. నా ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని న్యాయం చేయాలని కర్నూలు , చిత్తారి వీధికి చెందిన విజయకూమార్ ఫిర్యాదు చేశారు.
2) నా భర్త ఇమ్మానుయ్యేల్ బొంబాయిలో పని చేస్తున్నాడు. ఆస్తి కోసం ఆశ పడి నన్ను పెళ్ళి చేసుకున్నాడు. 2 నెలలు మాత్రమే నాతో కాపురం చేశాడు. నా భర్త పేరు మీద ఆస్తి వచ్చింది. తర్వాత నన్ను బొంబాయి నుండి పంపించి మోసం చేశాడని న్యాయం చేయాలని ఆదోని, మండి మెట్ట కు చెందిన రూప ఫిర్యాదు చేశారు.
3) నాకు ముగ్గురు కూమారులున్నారు. నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు. బాగా చూసుకుంటామని నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారు. దర్గా కు వెళదామని తీసుకెళ్ళి గుట్టపాడు గ్రామంలో బంధువుల ఇంటి దగ్గర వదిలి పెట్టి వెళ్ళి పోయారని నాకు న్యాయం చేయాలని ఓర్వకల్లు గ్రామంకు చెందిన బాహార్ బీ ఫిర్యాదు చేశారు.
4) నాకు ముగ్గురు కూమార్తెలు ఉన్నారు. నా ముగ్గురు కుమార్తెలతో పాటు నన్ను కలిపి ఇంటి ఆస్తి లో 4 వాటాలు చేశారు. నా కుమార్తెలు గోపిలక్ష్మీ, భూ లక్ష్మీ, మేన మామ రాముడు కలిసి నాకు ఇంటిలో ఆస్తి వాటా లేదని మోసం చేస్తున్నారని బయటకి వెళ్ళపోవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కర్నూలు, సోమిశెట్టి నగర్ కు చెందిన చిన్నమ్మ ఫిర్యాదు చేశారు.
5) నాకు ఇద్దరు కూమారులున్నారు. 8 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నాను. పండించిన పంటను, ఇంట్లో డబ్బులు తీసుకొని వెళుతున్నారు. మద్యం సేవిస్తూ, అల్లరి పనులు చేస్తూ మమ్మల్ని ఇంటిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని న్యాయం చేయాలని ఎమ్మిగనూరు, రాళ్ళదొడ్డి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.
6) కర్నూలు, నన్నూరు పంచాయితిలో ఉన్న స్నేహా గ్రీన్ సిటి లో నేను 2 ప్లాట్లను రూ. 14 లక్షలకు కొనుగోలు చేశాను. 3 నెలల క్రింద నా ప్లాట్ల నెంబర్ లు తీసి వేసి స్నేహా గ్రీన్ సిటి కి చెందిన సిద్దయ్య దున్ని నాడని వేరే వారికి అమ్మి మోసం చేయాలని చూస్తున్నాడని అనంతపురం జిల్లా, గుంతకల్ కు చెందిన శ్రీనివాస రెడ్డి ఫిర్యాదు చేశారు.
7) కర్నూలుకు చెందిన నాగిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి మధ్యవర్తిగా ఉంటూ ఒక పొలాన్ని రూ.58 లక్షల 55 వేల కు ఇప్పిస్తానని చెప్పి, డబల్ రిజిస్ట్రేషన్ చేయించి మోసం చేశాడని, మా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు, పొలం ఇప్పించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని న్యాయం చేయాలని కర్నూలు, వాసు నగర్ కి చెందిన విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ హామీ ఇచ్చారు.
ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, సిఐ ఇబ్రహీం పాల్గొన్నారు.