* చెంచుగూడెంలకు విద్యుత్ వెలుగులకు రూ. కోటి మంజూరు
* నీటిముంపు భాదిత చెంచు గూడెంల 44 ఏళ్ల చీకటిని తరిమెందుకు నిధులు మంజూరు చేయించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్లు దూరం, కృష్ణానది ఒడ్డున నల్లమల అరణ్యంలో క్రూర మృగాలు, విషసర్పాల మధ్య కనీసవసతులు కరువై జీవిస్తున్న అడవి బిడ్డలు ( గిరిజనతెగ ) చెంచులకు తానున్నానని భరోసా ఇస్తూ కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం, జానాలగూడెం, బలపాలతిప్ప చెంచుగూడెంలకు తారురోడ్డు నిర్మాణం కోసం రూ. 4.40 కోట్లు, అడవిలో 7.10 కిలోమీటర్లు దూరం తారురోడ్డు, వాటి వెంట విద్యుత్ స్థంబాలు, వీధిదీపాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మరో అడుగు ముందుకేసి ప్రధాన మంత్రి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం (PM-TANMAN)క్రింద కేంద్ర ప్రభుత్వం ద్వారా మూడు చెంచుగూడెంలలో విద్యుత్ సరఫరా, గిరిజనుల ఇళ్లకు కరెంట్ కనెక్షన్, గూడెంలలో అంతర్గత వీధిదీపాల ఏర్పాటుకు మరో కోటి రూపాయలు ఎంపీ శబరి మంజూరు చేయించినట్లు తెలిపారు.
కరెంటు లోఓల్టేజి సమస్య పరిష్కారం కోసం మండల కేంద్రమైన కొత్తపల్లిలో 33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్, శివపురం గ్రామంలో 11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్, మంజూరు చేయించినట్లు ఆమె తెలిపారు. ఈ కోటి రూపాయల విద్యుత్ సరఫరా మంజూరు వల్ల సిద్దేశ్వరం చెంచుగూడెంలో 40 కుటుంబాలు, బలపాలతిప్ప గూడెంలో 30 కుటుంబాలు, జానాలగూడెంలో 60 కుటుంబాలు, మొత్తం 130 చెంచుకుటుంబాల ఇళ్ల కరెంటు సరఫరాకు రూ కోటి రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించామని ఎంపీ శబరి తెలిపారు.