దిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌కి అత్యంత చేరువలోకి వచ్చి..
ఓ ద్రావణాన్ని పోయబోయాడు. మెరుపు వేగంతో స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అయినప్పటికీ కొంత ద్రావణం కేజ్రీవాల్ దుస్తులపై పడింది. అక్కడున్న ఆప్ కార్యకర్తలు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే, అతడు ఏ ద్రావణం పోశాడన్న దానిపై స్పష్టత లేదు..