రేషన్ బియ్యం కాదు. సోనామసూర్ అని నిర్ధారించిన రెవిన్యూ విఆర్ఓ, గ్రామపెద్దలు.

రేషన్ బియ్యం కాదు. సోనామసూర్ అని నిర్ధారించిన రెవిన్యూ విఆర్ఓ, గ్రామపెద్దలు.
 పంచనామా నిర్వహించి ఆటోతో పాటు బియ్యం,జొన్నల బస్తాలు అప్పగించిన పోలీసులు స్టోర్ బియ్యం అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు : ఎస్సై  

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- చిప్పగిరి మండల పరిధిలోని బంటనహల్ గ్రామం నుండి ఓ ఆటో నందు బియ్యం,జొన్నల బస్తాలతో వెళ్తున్న ఆటోను చిప్పగిరి పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు గత రాత్రి తరలించిన విషయం తెలిసిందే.ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు వీఆర్వో ఆంజనేయులు, గ్రామ పెద్దలు చాంద్ బాషా,గోపాల్ సమక్షంలో చిప్పగిరి ఎస్సై సతీష్ కుమార్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించి ఆటోలో తరలిస్తున్న బియ్యం బస్తాలు రేషన్ బియ్యం కాదని,సోనామసర్ బియ్యం అని నిర్ధారించారు.వీఆర్వో గ్రామ పెద్దల పంచనామా నివేదిక ఆధారంగా జొన్నలు బ్లాక్ మార్కెట్కు కాదని తమ బంధువుల ఇంటికి తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ శేఖర్ పోలీస్ సమక్షంలో వెల్లడించారు.ఇందులో 7 సోనామసూర్ బియ్యం బస్తాలు,5జొన్నల బస్తాలు,2 ప్యాకెట్లు పశువుల దాన ఉన్నట్లు,వాటిని ఆటో డ్రైవర్ శేఖర్ కు అప్పగిస్తున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ వివరించారు.ఎస్సై మాట్లాడుతూ ఆటోలో తరలిస్తున్న బియ్యం జొన్నలు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు అన్న అనుమానంతో స్టేషన్కు తీసుకొచ్చామన్నారు. ఆదివారం విఆర్ఓ ఆంజనేయులు గ్రామపెద్దల సమక్షంలో సమగ్రంగా విచారించి నిర్ధారించిన అనంతరం డ్రైవర్ శేఖర్ కు వాటిని అప్పగించామని ఎస్సై సతీష్ కుమార్ వివరించారు.ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పు అని ఎస్సై హెచ్చరించారు.పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ బాషా,సాగర్, షబ్బీర్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.