సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి;-ఎస్ఐ చంద్ర;-

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి;-ఎస్ఐ చంద్ర;-

వి 3టీవీ న్యూస్ హలహర్వి :-సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ చంద్ర అన్నారు.ఆదివారం హలహర్వి మండలం మేదేహల్ గ్రామంలో పర్యటించి ప్రజలకు నేరాలు పట్ల అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుండి పోను కాల్స్ వస్తే స్పందించరాదన్నారు.అపరిచిత వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు బ్యాంక్ ఖాతా ఆధారాలు,ఆధార్ కార్డు వివరాలు ఇవ్వడం వల్ల సైబర్ నేరగాళ్లు మీ ఖాతా నుంచి నగదు దోచేస్తారని అన్నారు.కావున గుర్తు తెలియని వ్యక్తులకు ఓటిపిలు,మొబైల్ ఫోన్లో ఇవ్వరాదన్నారు.ప్రతి ఒక్కరు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు బైక్ లు ఇవ్వరాదని హెచ్చరించారు.మీ పిల్లలపై మీరే జాగ్రత్తలు తిసుకోని పిల్లలు చదువుతున్నారా లేదా,కాలేజీ పోతున్నారు లేదా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు గమనించాలిని అన్నారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ విజయ్ కూమార్,పాండు, తదితరులు పాల్గొన్నారు.