కూటమి ప్రభుత్వంపై, రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనకు రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పవన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.దానికి ఆయన స్పందిస్తూ..
నేనేం లా అండ్ ఆర్డర్, హోం శాఖ చూడడం లేదు. నా శాఖ గురించి ఏదైనా అడిగితే చెప్పగలను. అయినా మీరు ఈ ప్రశ్న అడగాల్సింది.. సీఎం చంద్రబాబును, హోం మంత్రి అనితను. అయినప్పటికీ మీరు చెప్పినవన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తా అని అన్నారు.
అలాగే.. దర్శకుడు రాం గోపాల్ వర్మ తప్పించుకుని తిరుగుతున్నారని, చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఇప్పుడు ఎందుకు తటపటాయిస్తున్నారు? అని పవన్ వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో ఏం జరిగినా.. కూటమి ప్రభుత్వం తరఫున సమిష్టిగా బాధ్యత వహిస్తాం అని చెప్పారు.
గతంలో పవన్ కల్యాణ్.. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో హోం మంత్రి అనితను నిందిస్తూ.. తాను హోం మంత్రి పదవి చేపడితే పరిస్థితి మరోలా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు.