జెండర్ వ్యతిరేక కార్యక్రమాలు మాసోత్సవాలు .

జెండర్ వ్యతిరేక కార్యక్రమాలు మాసోత్సవాలు .

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండల కేంద్రంలో సోమవారం ఎంపీడీవో  కార్యాలయంలో  ఎంపీడీవో వరలక్ష్మి  అధ్యక్షతన, తాసిల్దార్ నయీ చేతన్ (జెండర్ వ్యతిరేక కార్యక్రమాలు మాసోత్సవాలు ఈనెల 25/11/2024 నుండి 23/12/2024) కార్యక్రమాల్లో భాగంగా  కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు, సభ్యులందరితో జండర్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం ర్యాలీ నిర్వహించడం జరిగింది,ఈ సందర్భంగా ఎంపీడీవో  మాట్లాడుతూ లింగ వివక్ష పై అవగాహన కల్పించాలని స్త్రీ విద్యను ప్రోత్సహించాలని బాల్య వివాహాలు నిషేధించాలని మూఢనమ్మకాలను లేకుండా అవగాహన కల్పించాలని తెలియజేశారు. 
తాసిల్దార్ మేడంగారు మాట్లాడుతూ మహిళలు అన్నీ రంగాలలో అభివృద్ధి చెందాలని తెలిపారు,
ఈ కోర్ కమిటీ సమావేశంలో అంగన్వాడీ సూపర్వైజర్లు వెలుగు ఏపీఎం, ఎంఈఓ, మండల పరిషత్ సిబ్బంది వెలుగు సిబ్బంది అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.