ఇంటర్ విద్యార్థిని గొంతు కోసుకున్న వైనం- గోప్యంగా ఆసుపత్రికి తరలింపు




వైఎస్ఆర్ జిల్లా..
కమలాపురం...

గురుకుల పాఠశాలలో ఘాతుకం
- ఇంటర్ విద్యార్థిని గొంతు కోసుకున్న వైనం
- గోప్యంగా ఆసుపత్రికి తరలింపు

స్థానిక కమలాపురం పట్టణంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.

మధ్యాహ్నం రెండు మూడు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కకుండా ప్రిన్సిపాల్ చాలా గోప్యంగా ఉంచి హెల్త్ సూపర్వైజర్ రెడ్డెమ్మ ఆధ్వర్యంలో కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.