పంటలు వేసిన ప్రతి రైతు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి...

పంటలు వేసిన ప్రతి రైతు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి...

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండలంలోని మాచానూరు, బాపురం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం వ్యవసాయ అధికారి శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం అయినది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి శివ శంకర్ మాట్లాడుతూ, రైతులకు వ్యవసాయ సలహాలు సూచనలు తెలుపుతూ, ఈ రబీ సీజన్ కు రైతులు జొన్న పంటకు 297/-మండల యూనిట్ ఎకరాకు మరియు శనగ పంటకు 420/- ఎకరాకు గ్రామ యూనిట్, కావున రబీ సీజన్లో పంటలు వేసిన ప్రతి రైతు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, ఇప్పటినుండి ఆప్షను వచ్చి ఉన్నది, కాబట్టి రైతులందరూ కచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ముఖ్యంగా రైతులకు అతివృష్టి అనావృష్టి వర్షాలు అధికమైన కానీ లేదంటే వర్షాలు లేకపోయినా కానీ పంటలు దిగుబడి ఆధారంగా గ్రామాల యూనిట్/మండల యూనిట్ ఆధారంగా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమంలో విఏఏలు ఇంద్రజ, విజయ్ మరియు రైతులు విరివిగా పాల్గొన్నారు.