భారత రాజ్యాంగ దినోత్సవం...
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించిన... అడిషనల్ ఎస్పీ జి. హుస్సేన్ పీరా .
V 3 టీవీ తెలుగు న్యూస్ కర్నూలు:
భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో భారత రాజ్యాంగ రూపకర్త డా.బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కర్నూలు అడిషనల్ ఎస్పీ జి. హుస్సేన్ పీరా పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ జి. హుస్సేన్ పీరా మాట్లాడుతూ...
మన దేశానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం కావాలని అంబేద్కర్ లాంటి మహానుభావులు కృషి చేసి రాజ్యాంగాన్ని తీసుకువచ్చారన్నారు.
రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా గర్వకారణమన్నారు.
అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు.
అందరితో భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించి, ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఐలు సోమశేఖర్ నాయక్, నారాయణ, జావేద్. ఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.