అందరూ సమన్వయంతో పనిచేయండి ... అడిషనల్ ఎస్పీ జి. హుస్సేన్ పీరా
• కోర్టు కానిస్టేబుళ్లు , పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ... అడిషనల్ ఎస్పీ సమావేశం
V3 టీవీ న్యూస్ కర్నూలు:
జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జిల్లా కోర్టు కానిస్టేబుళ్లతో అడిషనల్ ఎస్పీ . హుస్సేన్ పీరా సమావేశం నిర్వహించారు.
ఈ సంధ్బంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ...
డిసెంబర్ 14 వ తేదిన జరిగే లోక్ అదాలత్ లో అందరూ సమన్వయంతో బాగా పని చేయాలన్నారు.
వీలైనంత వరకు ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.
అధిక సంఖ్యలో కేసులు రాజీ కుదిరేలా న్యాయ శాఖ, పోలీసు శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు.
ఎదైనా కేసులలో నిందితులను అరెస్టు చేసేటప్పుడు సుప్రీం కోర్టు, హైకోర్టుల నియమ, నిబంధనలు విధి, విధానాలు పాటించాలన్నారు.
ఈ సమావేశంలో సిఐలు ప్రసాద్, రామయ్య నాయుడు, పిపిలు మరియు కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.