జిల్లా పోలీసు కార్యాలయంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం. ...
జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్
V 3 టీవీ తెలుగు న్యూస్ కర్నూలు :
కార్తీక మాసం పురస్కరించుకొని జిల్లా పోలీసు శాఖ పరిపాలనా విభాగం ఉద్యోగులు బుధవారం మధ్యాహ్నం స్దానిక జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ హాజరై ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు.
అనంతరం జిల్లా ఎస్పీ పోలీసు మినిస్టిరియల్ సిబ్బంది అందరితో కలిసి ఉసిరి చెట్టు క్రింద వనభోజనం చేశారు.
కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే మంచి జరుగుతుందని, అందరూ ప్రతి సంవత్సరం ఈ విధంగా కుటుంబసభ్యులతో కలిసి ఇటువంటి కార్యక్రమాలను జరుపుకొని సంతోషంగా ఉండాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ బి . హుస్సేన్ పీరా , డిపిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.