*దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో*







*దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో*

*న్యూఢిల్లీ :*

* దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో ప్రారంభమైంది. 
* ఢిల్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ దీన్ని ప్రారంభించారు. 
* సరోజిని నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తి స్థాయిలో మహిళ సిబ్బంది పని చేయనున్నారు.
* ఈ డిపోకు సఖి డిపో అనే పేరు కూడా పెట్టారు. 
* డిపో మెనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది అందరూ కూడా మహిళలే. 
* ఇందుకోసం మొత్తం 225 మంది సిబ్బందిని కేటాయించామని పేర్కొన్నారు. 
* అయితే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలో కూడా తమ హక్కులను పొందాలనే ఆలోచనతోనే ఈ డిపోను ప్రారంభించామని మంత్రి తెలిపారు.