అంతరాష్ట్ర దొంగలముఠా అరెస్టు... కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ .
• 21 కేసులలో దొంగలించబడిన మొత్తము విలువ రూ.41 లక్షల,11 వేల, 8 వందల/-ప్రాపర్టీ స్వాధీనం.
• 478.7 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ. 33 లక్షల 7 వేల 8 వందల విలువ) , నగదు రూ. 8 లక్షల 4 వేల నగదు స్వాధీనం. (వీటి మొత్తం విలువ రూ. 41 లక్షల,11 వేల, 8 వందలు)
• భారీగా ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్న... ఆదోని ఒకటవ పట్టణ పోలీసులు
• 13 మంది అరెస్టు...(అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా దొంగలు)
• ప్రాపర్టీ రికవరీలో ప్రతిభ కనబరచిన ఆదోని ఒకటవ పట్టణ సిఐ శ్రీరామ్, ఎస్సై రామస్వామి , పోలీసుసిబ్బందిని అభినందించి, రివార్డులు అందజేసిన... జిల్లా ఎస్పీ.
V3 టీవీ తెలుగు న్యూస్ కర్నూలు:
కర్నూలు జిల్లాలోని 21 కేసులలో దొంగలించిబడిన సొత్తును ఆదోని ఒకటవ పట్టణ పోలీసులు రికవరీ చేసి 13 మందిని అరెస్టు చేశారని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ గురువారం తెలిపారు.
ఈ సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు వివరాలు వెల్లడించారు.
అక్టోబర్ 5 వ తేదిన ఆదోని సబ్ డివిజన్ లో ప్రాపర్టీ రికవరీ నేరాల పై సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు ప్రాపర్టీ రివకరీ బాగా చేస్తామని చెప్పడం జరిగిందని, చెప్పినట్లే బాగా చేశారన్నారు. గత 6 నెలల నుండి ప్రాపర్టీకేసులు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల లో పెండింగ్ లో ఉన్నందున వాటిని త్వరితగతిన పరిష్కారంచేసి పలు కేసులలో పోయిన సొత్తును రికవరీ చేసి భాధితులకు న్యాయం చేయాలని ఆదేశించామన్నారు.
రూ. 24 లక్షల విలువ గల బైక్ లను ఇది వరకే రికవరీ చేశారన్నారు. ఈరోజు 41 లక్షల ప్రాపర్టీ రికవరీ చేయడంలో ఆదోని సబ్ డివిజన్ పోలీసులు బాగా పని చేశారన్నారు.
ఆదోని డిఎస్పీ సోమన్న, ఆదోని ఒకటవ పట్టణ సిఐ శ్రీరామ్, ఎస్సై రామస్వామి , పోలీసుసిబ్బంది బృందాలుగా ఏర్పడి బాగా పని చేశారన్నారన్నారు.
స్పూర్తిగా తీసుకొని కర్నూలు జిల్లాలోని మిగతా సబ్ డివిజన్ ల పోలీసులందరూ ప్రాపర్టీ రికవరీలు, మిస్సింగ్ కేసులు, పెండింగ్ కేసులలో మంచి ప్రతిభను చూపాలన్నారు.
ప్రాపర్టీ రికవరీలో బాగా పనిచేసిన ఆదోని ఒకటవ పట్టణ పోలీసులకు జిల్లా ఎస్పీ గారు రివార్డులు అందజేశారు.
ఆదోని ఒకటవ పట్టణ సిఐ శ్రీరామ్ కి బహుమతి అందజేశారు.
ఎస్సై రామస్వామి, హెడ్ కానిస్టేబుల్స్.... సత్తార్ వలి , హాజీ భాషా, కానిస్టేబుల్స్.... రంగస్వామి, మునిస్వామి, నాగరాజు, మునిచంద్ర, ఏకవీర శేఖర్, హుస్సేన్ భాషా, మధుసుధన, అల్లెన్న, దామోదర్, రామచంద్ర, సుధీర్ కుమార్. హోంగార్డు సింధు, డ్రైవర్ బోజా, ముస్తాక్ భాషా లకు జిల్లా ఎస్పీ గారు నగదు రివార్డులు అందజేశారు.
ఆదోని టౌన్, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, నెల్లూరు జిల్లా మరియు చుట్టుపక్కల జిల్లాలలో 10 రోజుల నుంచి నిఘా ఉంచారు.
అంతరాష్ట్ర ముఠా కు సంబంధించిన రెండు ముఠాలను ఆదోని టౌన్ లోని తిమ్మారెడ్డి బస్టాండు మరియు ఆత్మకూరు టౌన్ లోని సిద్దాపురము వద్ద ఉన్న అడవులలో వేరువేరుగా పట్టుకున్నారన్నారు. విచారించి దొంగలించిన సొత్తును స్వాధీనంలోకి తీసుకున్నారు.
నిందితుల నేపథ్యం...
ఈ అంతర్జాతీయ దొంగలముఠా దేశంలో అన్నిచోట్ల తిరుగుచూ ముఖ్యంగా మరియు కర్నూల్ జిల్లాలో పలు ప్రాంతాలలో దొంగతనాలు చేశారు. ఇవే కాకుండా రద్దీగా ఉండే తిరునాళ్లు, బహిరంగ సభలు జాతరలు, పాదయాత్రలు, దేవుని ఊరేగింపులు , ఉత్సవాలు , ఎక్కువ జనాభా గూమి గూడే ప్రదేశాలలో బ్యాగ్ లిఫ్టింగ్, పిక్ ప్యాకెటింగ్, అటెన్సన్ డైవర్షన్ దొంగతనాలకు పాల్పడతారన్నారు.
కర్నూలు జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రం పలు ప్రాంతాలలో ముఖ్య నగరాలలో , దేశంలోని పలు రాష్ట్రాలలో, ముఖ్య నగరాలైనా అయోద్య, వారణాసి, కలకత్తా, గోవా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, హరిద్వార్, తిరుపతి, శ్రీశైలం పలు పెద్ద పెద్ద పుణ్య క్షేత్రాలకు వెళ్ళి దొంగతనాలకు పాల్పడుతున్నారు. గతంలో కూడా వీరి పై పలు కేసులు నమోదు అయినావన్నారు.
వీరందరిని రిమాండుకు తరలించడమైనది. పరారీ లో ఉన్న ఇద్దర్నీ కూడా త్వరలో అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, త్వరలో అరెస్టు చేస్తామన్నారు.
అంతర్ రాష్ట్ర దొంగలు...
1. సముద్రాల పృథ్వీ రాజ్ (Age: 31 Years) , S/o సముద్రాల డేవిడ్ , కప్పరాల తిప్ప, దామవరం, అల్లిమడుగు సంఘం గ్రామం , బోగోలే మండలం, బిట్రగుంట పోలీసుస్టేషన్ , నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం.
2. దండగల సరోజ , Age: 37 Years, W/o దండగలకోటయ్య , రెహమత్ నగర్ , ఆత్మకూరు , నంద్యాల జిల్లా.
3. మాణిక్యాల విష్ణు, age 22 Yrs, S/o మాణిక్యాల అలియా , రెహమత్ నగర్ , ఆత్మకూరు , నంద్యాల జిల్లా..
4. సముద్రా ఏసుబాబు @ యేసోబు, Age: 52 Years, s/o ఏసు రత్నం, అల్లిమడుగు గ్రామం, బిట్రగుంట పోలీసుస్టేషన్ , నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం.
5. సమురాళ్ళ జగదీష్, Age: 31 Years, S/o సమురాళ్ళ మోహన్ రావు , కప్పరాల తుప్ప , దామవరం, అంబేద్కర్ నగర్ , అల్లిమడుగు సంఘం గ్రామం , బోగోలే మండలం, బిట్రగుంట పోలీసుస్టేషన్ , నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం.
6. గుంజా రాఘవ @ జోల్లోడుస్ Age: 13 Years, S/o ఆశీర్వాదం , సిద్దాపురం గ్రామం, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా.
Present రెహమత్ నగర్ , ఆత్మకూరు , నంద్యాల జిల్లా.
7. సముద్రాల డేవిడ్ Age: 52 Years, S/o సముద్రాల ఏసు రత్నం, అల్లిమడుగు సంఘం, అల్లిమడుగు గ్రామం , బిట్ర గుంట పోలీసుస్టేషన్ , నెల్లూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ .
8. రామలక్ష్మీ @ పెట్టల రామ లక్ష్మమమ్మ age: 42 years, w/o H.No.9-59(2), సిద్దాపురం గ్రామం, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా.
9. బైరాపురం షేక్ దావూద్ భాషా, age: 55 years, s/o బైరాపురం షేక్ అబ్దుల్ రహిమాన్ H. No. 17-74/7/4, కిసాన్ సింగ్ స్ట్రీట్ , ఆత్మకూర్ టౌన్ , నంద్యాల జిల్లా.
అంతర్ రాష్ట్ర దొంగలలో పరారీ లో ఉన్న ముద్దాయిలు :-
10. రమణమ్మ @ చిన్న పాప ( 28 years), కప్పెరాలతిప్ప గ్రామం, బింట్రగుంట , నెల్లూరు జిల్లా.
11. గిడ్డన్న @ గిడ్డి సిద్దాపురం గ్రామం, ఆత్మకూరు మండలం.
అరెస్టు కాబడిన అంతర్ జిల్లా దొంగలు:
1. బోయఆకులవీరేష్,వయస్సు: 25 సంవత్సరాలు,తండ్రిపేరు రాజు,లక్ష్మిపేట,ఎమ్మిగనూ టౌన్,కర్నూల్ జిల్లా.
2. సయ్యద్మహమ్మద్,వయస్సు: 34 సంవత్సరాలు,తండ్రి పేరు లేట్ బాబుసాహెబ్, క్రాంతినగర్,ఆదోనిటౌన్
3. మాలవీరేష్, వయస్సు: 27 సంవత్సరాలు, తండ్రి పేరు లేట్ రంగన్న, గొల్ల గూడూరు గ్రామము,వేములమండలం,కడప జిల్లా.
4. బోయవీరేష్,వయస్సు: 25సంవత్సరాలు,తండ్రిపేరులేట్ నాగరాజు,ఎమ్మిగనూరు టౌన్ ,కర్నూల్ జిల్లా .
పైన అరెస్టు కాబడిన ముద్దాయిలు వివిధ సంధర్బాలలో ఆదోని మరియు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధి లో దొంగతనాలు చేసి ఉన్నందున వారిపై జిల్లాలోని ఆయా పోలీసు స్టేషన్ లలో 21 కేసులు నమోదు కాబడి పెండింగ్ లో ఉన్నవి.
పై ముద్దాయిల నుంచి 21 కేసులలో మొత్తము Rs.41,11,800/-ప్రాపర్టీ ని స్వాధీనము చేసుకోవడమైనదన్నారు.
వాటిలో రూ. 33,07,800/- రూపాయల విలువ గల 478.7 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు Rs. 8,04,000/-నగదు ఉన్నవి.
ప్రాపర్టీని కోర్టు అనుమతితో బాధితులకు అప్పచెప్పడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదోని డిఎస్పీ సోమన్న , ఆదోని ఒకటవ పట్టణ సిఐ శ్రీరామ్, సిఐలు ప్రసాద్, కేశవరెడ్డి, అబ్దుల్ గౌస్, మన్సురుద్దీన్, శివశంకర్, ఆదోని ఒకటవ పట్టణ ఎస్సై రామస్వామి మరియు సిబ్బంది పాల్గొన్నారు.