*సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ నెంబర్-1గా నిలుస్తుంది*

*సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ నెంబర్-1గా నిలుస్తుంది*

*ఆయనకున్న దూరదృష్టి మరెవరికీ లేదు*

*స్వర్ణాంధ్ర విజన్-2047 విడుదల సందర్భంగా పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యే పరిటాల సునీత*

*ఈ విజన్ ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకమవుతుందన్న శ్రీరామ్, సునీత*

ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందని ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శనివారం విజయవాడలో విడుదల చేసిన స్వర్ణాంధ్ర విజన్ -2047 పై వారు ప్రశంసల వర్షం కురిపించారు. ఇందులో అంశాలు చూసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న దూరదృష్టి మరెవరికీ లేదన్నది స్పష్టంగా అర్థమైందన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఉందన్నారు. అయితే అంతలోపే రాష్ట్రం నెంబర్ వన్ అవుతుందన్న నమ్మకం మాకుందన్నారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అన్ని విధాలుగా వెనుకబడిందన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మళ్లీ గాడిలో పడిందన్నారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ముఖ్య ఉద్దేశమని.. ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ, మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేలా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించారన్నారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికీ నీటి భద్రత, రైతు - వ్యవసాయ సాంకేతికత, ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ (లాజిస్టిక్స్), శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాలలో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశలలో సమగ్ర సాంకేతికత వంటి 10 సూత్రాలతో విజన్ 2047 రూపొందించారన్నారు. ఇది కచ్చితంగా మిలిగిన రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందని పరిటాల శ్రీరామ్ పరిటాల సునీత స్పష్టం చేశారు...