బాల భారతి స్కూల్‌లో చదువుతున్న తల్లితండ్రులు లేని పిల్లలలకు తానా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 10 లక్షలు చెక్కు

పాణ్యం నియోజకవర్గo,ఓర్వకల్లు మండల కేంద్రం:-
గత 5 ఏళ్లుగా  బాల భారతి స్కూల్‌లో చదువుతున్న తల్లితండ్రులు లేని పిల్లలలకు తానా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చేస్తున్న ఆర్థిక సాయంలో భాగంగా బుధవారం పాఠశాల యాజమాన్యానికి రూ. 10 లక్షల రూపాయలు చెక్కును విరాళంగా అందజేసిన ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి  వెంకట రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారి సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డి తాానా మెంబర్ NRI పొట్లూరి రవి , వ్యాపారవేత్త ముప్ప రాజశేఖర్ మధు . ఈ కార్యక్రమంలో ఐక్య సంఘం అధ్యక్షురాలు విజయ భారతి గారు,మండల అధ్యక్షుడు గోవింద్ రెడ్డి, గుట్టపాడు సర్పంచ్ మోహన్ రెడ్డి,మండల నాయకులు రామ భూపాల్ రెడ్డి,ఎస్సి సెల్ నాయకులు ఏసోబు,తదితరులు పాల్గొన్నారు.