విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం... కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 123 ఫిర్యాదులు .
వృద్దులు, దివ్యాంగుల వద్దకు వెళ్ళి ఫిర్యాదులు స్వీకరించి భరోసా కల్పించిన ...జిల్లా ఎస్పీ.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన ... జిల్లా ఎస్పీ.
కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జి. బిందు మాధవ్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి సోమవారం మొత్తం 123 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ...
1) కర్నూలు రేడియో స్టేషన్ లో గవర్నమెంట్ అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని కర్నూలు కు చెందిన చంద్రశేఖర్, శ్రీకాంత్ లు రూ. 18 లక్షలు తీసుకొని మోసం చేశారని కర్నూలు మండలం, ఎదురూరు గ్రామానికి చెందిన శివకుమార్ ఫిర్యాదు చేశారు.
2) కర్నూలు జోహారాపురం కు చెందిన శ్రీనివాసులు కర్నూలు కోట్ల రైల్వేస్టేషన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని ఎ వి ఆర్ ఇన్ఫోటెక్ అనే పేరుతో ఐడి కార్డు ఇచ్చి డబ్బులు తీసుకొని మోసం చేశాడని కల్లూరు మండలం కు చెందిన ప్రసాద్ ఫిర్యాదు చేశారు.
3) గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉద్యోగం ఇప్పిస్తానని కర్నూలు కు చెందిన శివాజీ అనే వ్యక్తి డబ్బులు తీసుకొని మోసం చేశాడని కర్నూలు మండలం , నూతన పల్లె గ్రామానికి చెందిన వంశీనాథ్ ఫిర్యాదు చేశారు.
4) మా పొలంకు ఉన్న వాటర్ పైప్ లైన్ కట్ చేసి కాల్వ పూడ్చిన వారి పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కల్లూరు మండలం, పుసులూరు గ్రామంకు చెందిన తిమ్మారెడ్డి ఫిర్యాదు చేశారు.
5) కైరుప్పల గ్రామానికి చెందిన కుమ్మరి వీరభద్రి కొందరు వ్యక్తులతో కలిసి ఫోర్జరి సంతకాలతో నాకు చెందిన ఒక ఎకర, యాభై నాలుగు సెంట్ల పొలాన్ని ఆక్రమించుకున్నారని ఆస్పరి మండలం, కైరుప్పల గ్రామానికి చెందిన ఎస్ బి ఐ రిటైర్డ్ విజయ్ మోహన్ ఫిర్యాదు చేశారు.
6) కర్నూలు లో మెడికల్ షాపులో పని చేస్తున్నాను. రెహాన్ అనే వ్యక్తి అడ్వకేట్ గా పని చేస్తున్నాని చెప్పి పరిచయం అయి బ్యాంకు లోన్ ఇప్పిస్తానని, భూ సమస్యలు పరిష్కరిస్తానని రూ. ఒక లక్ష 50 వేలు తీసుకొని చీటింగ్ చేశాడని ఓర్వకల్లు మండలం, ఓర్వకల్లు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు.
7) పంచలింగాల దగ్గర ఉన్న ఒక ఎకర 80 సెంట్ల పొలాని కి డబ్బులు తీసుకున్న వ్యక్తులు రిజిస్టర్ చేయడం లేదని న్యాయం చేయాలని కర్నూలు అశోక్ నగర్ కు చెందిన శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు.
8) గాయత్రి ఎస్టేట్ లోని ఒక మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు ఇవ్వడం లేదని కర్నూల్ కు చెందిన తలారి రోహిత్ ఫిర్యాదు చేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ బి.. బిందు మాధవ్ హామీ ఇచ్చారు.
ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సిఐ శివశంకర్ పాల్గొన్నారు.