ABCD (Award for Best Crime Detection) అవార్డును సాధించిన ...కర్నూలు జిల్లా పోలీసులు.
.... రాష్ట్రడిజిపి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ... కర్నూలు జిల్లా ఎస్పీ బి. బిందు మాధవ్ , పోలీసు అధికారులు.
V3 టీవీ తెలుగు న్యూస్ కర్నూలు:
విజయవాడలో జరిగిన ఏబీసీడీ అవార్డుల కార్యక్రమంలో డి.జి.పి కార్యాలయంలో నిర్వహించిన ABCD అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర డి.జి.పి సి.హెచ్. ద్వారక తిరుమలరావు, సీనియర్ అధికారుల సమక్షంలో కర్నూలు జిల్లా పోలీసులకు ABCD అవార్డు అందజేశారు.
కర్నూలు జిల్లా పోలీసులను డి.జి.పి ప్రత్యేకంగా అభినందించారు.
జరిగిన విషయం.........కర్నూలు జిల్లా, ఆస్పరి మండలంలోని చిన్న హోతూరు గ్రామం లో 2024 జూలై 28 వ తేది పేటయ్య అనే యువకుడిని చంపి డ్రమ్ములో సీల్ వేసి పెట్టి పాడేసి వెళ్ళారు. గుర్తు తెలియని మృతదేహం గా పోలీసులు గుర్తించారు.
డబ్బుకోసం పేటయ్య అనే యువకుడిని నమ్మించి పొలం అమ్మిన డబ్బులు దొంగలించడానికి మద్యం మత్తులో మద్యంలో సెనైడ్ వంటి విష పదార్దాలు కలిపి ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ హత్యకు పాల్పడ్డారని ఆస్పరి పోలీసులు దర్యాపు చేసి కేసు చేధించారు.
ఈ కేసును చాకచక్యంగా త్వరితగతిన దర్యాప్తు చేసినందుకు , ముద్దాయిలను అరెస్ట్ చేసినందుకు గాను ప్రతిష్టాత్మక ABCD అవార్దులో కర్నూలు పోలీసులు తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు.
డిజిపి కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ , అప్పట్లో పత్తికొండ డిఎస్పీ గా పని చేసిన పి. శ్రీనివాస రెడ్డి, అప్పట్లో ఆస్పరి సిఐ గా పని చేసిన సిఐ ఎస్. హనుమంతప్ప, ప్రస్తుతం పని చేస్తున్న ఆస్పరి సిఐ డి.మస్తాన్ వలి, కానిస్టేబుల్ ఆగస్టీన్, ఆస్పరి హోంగార్డు గోవర్దన్ ల కృషిని గౌరవిస్తూ, తృతీయ బహుమతి ( రూ. 40 వేల రూపాయలు) ప్రదానం చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ నేర పరిశోధన చేసిన కేసులకు గాను ABCD అవార్డును అందజేస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జరగనున్న ABCD అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో సిఐడి అడిషనల్ డిజి డా. రవిశంకర్ అయ్యాన్నార్, లా అండ్ ఆర్డర్ ఐజి సీహెచ్.శ్రీకాంత్, ఈగల్ ఐజి ఆకె రవికృష్ణ, రైల్వే మరియు స్పోర్ట్స్ ఐజిపి కే.వి.మోహనరావు పలువురు ఉన్నతాధికారులు, ఇతర జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.