మాకు పెళ్లి వద్దు.. పిల్లలు వద్దు..

మాకు పెళ్లి వద్దు.. పిల్లలు వద్దు..

జపాన్ యువత పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనడం లేదు. నిరుద్యోగం, అధిక జీవన వ్యయం, ఇతర కారణాలతో జపనీయులు పిల్లలు వద్దనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక కొత్త అధ్యయనం షాకింగ్ విషయాలను బయట పెట్టింది. జపాన్లో 2005లో జన్మించిన ప్రతి 3 ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితం మొత్తంలో పిల్లల్ని కనకపోవచ్చని ఈ అధ్యయనం చెబుతోంది.