జానీ మాస్టర్ జైలుకు వెళ్లటంలో అల్లు అర్జున్ కుట్ర? తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

జానీ మాస్టర్ జైలుకు వెళ్లటంలో అల్లు అర్జున్ కుట్ర? తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట 

దిశ, డైనమిక్ బ్యూరో: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) అరెస్ట్‌, తర్వాత విడుదల అవ్వడం దేశావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) సంచలన వ్యాఖ్యలు చేశారు.‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు అతనొక్కడికే ఉండాలని అల్లు అర్జున్ కుట్ర పన్నలేదా? కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) జైలుకు వెళ్లడంలో అర్జున్ అర్జున్ కుట్ర ఉందా? లేదా? ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ రాసింది వీళ్లు కాదా? మరి ఈ కేసులో అల్లు అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు (National Award) వెనక్కి ఇస్తాడా?’ అని మల్లన్న ప్రశ్శించారు.

కాలం సమాధానం చెప్తాది కొన్నింటికి.. అల్లు అర్జున్ నువ్వు కూడా రాత్రి జైల్లో ఒకరోజు ఉన్నావ్ కాదా? పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు రావడం ఏమిటి? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా మల్లన్న మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ అరెస్ట్‌, తర్వాత విడుదల అవ్వడం దేశావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.